సింగపూర్‌లో భారత మహిళపై 28 కేసులు.. ఆమె అలా చేసిందనే..

దిశ, వెబ్‌డెస్క్ : భారత సంతతికి చెందిన ఓ మహిళ పని మనిషి పట్ల తన కృరత్వాన్ని ప్రదర్శించింది. పని చేయించుకుని తిండి పెట్టకుండా చిత్రహింసలకు పాల్పడింది. కనీసం డస్ట్ బిన్‌లో వేసిన ఆహారాన్ని సైతం తినకుండా అడ్డుకుని పైశాచికంగా ప్రవర్తించింది. పని మనిషి ప్రాణాలు వదలడంతో విషయం వెలుగు చూసింది. సింగపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాయత్రి మురుగన్ (40) ఇండియాకు చెందిన మహిళ. ఆమె సింగపూర్‌లో 2015 నుంచి […]

Update: 2021-02-24 03:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత సంతతికి చెందిన ఓ మహిళ పని మనిషి పట్ల తన కృరత్వాన్ని ప్రదర్శించింది. పని చేయించుకుని తిండి పెట్టకుండా చిత్రహింసలకు పాల్పడింది. కనీసం డస్ట్ బిన్‌లో వేసిన ఆహారాన్ని సైతం తినకుండా అడ్డుకుని పైశాచికంగా ప్రవర్తించింది. పని మనిషి ప్రాణాలు వదలడంతో విషయం వెలుగు చూసింది. సింగపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గాయత్రి మురుగన్ (40) ఇండియాకు చెందిన మహిళ. ఆమె సింగపూర్‌లో 2015 నుంచి నివసిస్తోంది. తన ఇంట్లో పని చేయడం కోసం మయన్మార్‌కు చెందిన పియాంగ్‌(24)ను ఐదు నెలల క్రితం పనిలో పెట్టుకుంది. ఇంట్లోనే ఆశ్రమం కల్పించిన గాయత్రి.. పియాంగ్‌‌తో పొద్దంతా పని చేయించుకునేది. ఈ క్రమంలో అలసిపోయినా, ఆకలి అని అడిగినా ఆమెపై పిడిగుద్దులు కురిపించేది. రబ్బర్ స్టాంప్‌లు, ఇతర వస్తువులతో చావబాదేది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించేది.

ఆకలికి తట్టుకోలేక డస్ట్ బిన్‌లో వేసిన అన్నం తినడానికి ప్రయత్నించిన పని మనిషిపై గాయత్రి రెచ్చిపోయింది. ఆమెను కిటికీకి కట్టేసి వేడివేడి పదార్థాలు మీదపోసి చిత్రహింసలకు గురిచేసింది. అలా ఆమెకు నిత్యం అన్నం పెట్టకుండా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువుల ఫిర్యాదులో సింగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టులో సంచనల విషయాలు వెలుగుచూపాయి.

పని మనిషి పియాంగ్‌ శరీరంలో 31 చోట్ల గాయాల తాలూకు మచ్చలుండగా, బయట చర్మంపై 47 గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. తలపై బలమైన దెబ్బ కొట్టడంతోనే మెదడులో రక్తం గడ్డకట్టి ఆమె చనిపోయిందని, ఆహారం అందకపోవడం కూడా ఆమె మరణానికి మరో కారణమని పోస్ట్ మార్టం నివేధికలో పేర్కొన్నారు. నిందితురాలు గాయత్రిపై 28 అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News