ఏపీలో కరోనా @ 2,671

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ కంట్రోల్‌లోకి వస్తున్నట్టు కనబడడం లేదు. లాక్‌డౌన్ చేపట్టి రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసులు భారీగానే బయటపడుతున్నాయి. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నామని చెబుతోంది. మరోవైపు ఆస్పత్రుల నుంచి భారీ సంఖ్యలో కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని కూడా చెబుతోంది. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం విశేషం. కాగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో 44 మందికి […]

Update: 2020-05-25 02:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ కంట్రోల్‌లోకి వస్తున్నట్టు కనబడడం లేదు. లాక్‌డౌన్ చేపట్టి రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసులు భారీగానే బయటపడుతున్నాయి. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నామని చెబుతోంది. మరోవైపు ఆస్పత్రుల నుంచి భారీ సంఖ్యలో కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని కూడా చెబుతోంది. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం విశేషం.

కాగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో 44 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన 2,671 మంది పడ్డారని ప్రకటించింది. గత 24 గంటల్లో మొత్తం 10,240 మందికి పరీక్షించామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 2,671 కరోనా కేసుల్లో 767 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1,848 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 56 మంది మరణించినట్టు తెలిపింది.

Tags:    

Similar News