ఏపీలో కరోనా @ 2561
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ విధించి రెండు నెలలు ముగిసినా కరోనా కేసులు కంట్రోల్‌లోకి రావడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,561కి చేరుకుందని వెల్లడించింది. ఇందులో 727 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ విధించి రెండు నెలలు ముగిసినా కరోనా కేసులు కంట్రోల్‌లోకి రావడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,561కి చేరుకుందని వెల్లడించింది. ఇందులో 727 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 1778 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో కృష్ణాజిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య మొత్తం 56కి చేరింది.