అబ్బ.. ఆ లేగ దూడది ఎంత అదృష్టం..

దిశ, వెబ్‌డెస్క్ : అది ఓ గ్రామం. అక్కడ ఓ ఇంటి ముందు టెంట్.. బంధువులు, మిత్రులు, అందరూ ఆ ఇంటికి వెళ్తున్నారు. బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ క్రతువు వైభవంగా జరుగుతోంది. అటుగా వెళ్లిన గ్రామస్తులు సైతం ఆ పూజలో పాల్గొంటున్నారు. ఇంతకూ అంతగా గ్రాండ్ గా జరుగుతున్న శుభకార్యం ఏంటో అనుకుంటున్నారా..? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. గోవుపై ఉన్న ప్రేమతో ఓ వ్యక్తి లేగ దూడకు బారసాల నిర్వహించాడు. వినడానికి విడ్డూరంగా […]

Update: 2021-04-16 02:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అది ఓ గ్రామం. అక్కడ ఓ ఇంటి ముందు టెంట్.. బంధువులు, మిత్రులు, అందరూ ఆ ఇంటికి వెళ్తున్నారు. బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ క్రతువు వైభవంగా జరుగుతోంది. అటుగా వెళ్లిన గ్రామస్తులు సైతం ఆ పూజలో పాల్గొంటున్నారు. ఇంతకూ అంతగా గ్రాండ్ గా జరుగుతున్న శుభకార్యం ఏంటో అనుకుంటున్నారా..? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. గోవుపై ఉన్న ప్రేమతో ఓ వ్యక్తి లేగ దూడకు బారసాల నిర్వహించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇదే పక్కా నిజం.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన జక్కని గాలిబ్‌కు పశువులంటే ప్రాణం. తను సాధుకునే ఆవు ఇటీవల లేగదూడకు జన్మనిచ్చింది. దానిని ఆ కుటుంబం తన సొంత బిడ్డగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. అంతే కాదు. తమ పిల్లలకు నిర్వహించినట్టే లేగ దూడకు బారసాల ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

బారసాల ఫంక్షన్‌కు బంధుమిత్రులకు ఆహ్వానం పలికిన గాలిబ్.. వేద మంత్రోచ్ఛణల మధ్య గోవుకు నూతన వస్త్రాలు కప్పారు. లేగదూడ కోసం ఊయలకట్టి దానిని అందులో వేసి పాటలు పాడారు. పసుపు, కుంకుమ మంగళ హారతులతో మహిళలు బారసాలను ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ సర్పంచ్ మల్లేశ్‌తోపాటు గ్రామస్తులు భారీగా హాజరై బారసాలను నిర్వహించారు. మనుషుల మధ్య బంధాలు తెగుతున్న ఈ రోజుల్లో ఓ మూగజీవిని ఫంక్షన్ చేస్తున్న అతడి మనసును అందరూ అభినందిస్తున్నారు.

Tags:    

Similar News