World Cup Qualifiers 2023: సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌.. యూఎస్‌ఏపై జింబాబ్వే సంచలన విజయం

World Cup Qualifiers 2023లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసింది.

Update: 2023-06-26 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: World Cup Qualifiers 2023లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసింది. జింబాబ్వే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. యూఎస్‌ఏను ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ జాబితాలో టీమిండియా తర్వాతి స్థానాన్ని జింబాబ్వే ఆక్రమించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సీన్‌ విలియమ్స్‌ 101 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఇందుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్‌ గుంబీ (78) రన్స్ చేయగా.. సికందర్‌ రజా (48), రియాన్‌ బర్ల్‌ (47) పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ 104 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌ దారుణ వైఫల్యం కారణంగా యూఎస్‌ఏకు 304 పరుగుల భారీ తేడాతో ఓడింది.


Similar News