World Cup 2023: ఆకాశంలో వన్డే వరల్డ్ కప్..

ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ప్రమోషన్‌ను ఐసీసీ భారీగా ప్లాన్ చేసింది.

Update: 2023-06-26 17:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ప్రమోషన్‌ను ఐసీసీ భారీగా ప్లాన్ చేసింది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత్‌లోని వివిధ స్టేడియంలు ముస్తాబవుతున్నాయి. కాగా, ఈ టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించేలా ఐసీసీ వినూత్న రీతిలో వరల్డ్ కప్ ట్రోఫీని స్ట్రాటో ఆవరణంలోకి పంపింది. ఓ వాతావరణ బెలూన్‌కు ఈ ట్రోఫీని అనుసంధానం చేసి గాల్లోకి వదిలారు. ఈ బెలూన్‌ను 1,20,000 అడుగుల ఎత్తులో ఆవిష్కరించింది. ఇది భూమికి పైభాగంలోని ట్రోపోస్ఫియర్‌కు, మీసోస్ఫియర్‌కు మధ్యలో ఉన్న స్ట్రాటో ఆవరణంలోకి చేరుకుంది. అత్యాధునిక 4K కెమెరాలతో ట్రోఫీని ఫొటోలు తీసి, ఆ ఫొటోలను గ్రౌండ్ స్టేషన్‌కు పంపారు.

అనంతరం ఈ బెలూన్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కిందికి దిగింది. వరల్డ్ కప్ ట్రోఫీ ప్రపంచయాత్ర జూన్ 27న ప్రారంభం కానుంది. ఆతిథ్యదేశం భారత్‌తో పాటు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఉగాండా, నైజీరియా, బహ్రెయిన్, మలేసియా, కువైట్ తదితర 18 దేశాల మీదుగా ఈ ట్రోఫీ ప్రయాణించనుంది.


Similar News