ICC World Cup 2023: కుశాల్ మెండిస్ సెంచరీ.. శ్రీలంక స్కోరు ఎంతంటే?
ICC World Cup 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జోరుగా బ్యాటింగ్ చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జోరుగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 5 పరుగుల వద్ద ఓపెనర్ కుశాల్ పెరీరా డకౌట్ అయ్యాడు. హసన్ అలీ బౌలింగ్‌లో రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత ఓపెనర్ పాతుమ్ నిస్సంకకు కుశాల్ మెండిస్ జతచేరి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత నిస్సంక (51; 7 ఫోర్‌లు, 1 సిక్సర్) షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో షఫీఖ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కుసాల్ మెండిస్ (74 బాల్స్‌లో 110) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోర్ 17.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 27.5 ఓవర్‌లకు 203 రన్స్ చేసింది. కుసాల్ మెండిస్ (110), సదీర సమరవిక్రమ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.