Golden Ticket: సచిన్‌ టెండుల్కర్‌కు గోల్డెన్‌ టికెట్‌..

భారత్‌ వేదికగా ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ జరుగనున్నది.

Update: 2023-09-08 10:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ జరుగనున్నది. ప్రపంచ కప్‌ను ప్రత్యేకంగా మార్చేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులను ప్రపంచకప్‌ చూసేందుకు ఆహ్వానిస్తున్నది. ఇందు కోసం ‘గోల్డెన్‌ టికెట్‌ ఫర్‌ ఇండియా ఐకాన్స్‌’ తీసుకువచ్చింది. తొలి టికెట్‌ను బాలీవుడ్‌ మెగాస్టార్‌, సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు అందజేసింది. తాజాగా క్రికెట్‌ దేవుడి సచిన్‌ టెండుల్కర్‌కు టికెట్‌ను బీసీసీఐ అందజేసింది. బోర్డు కార్యదర్శి జైషా సచిన్‌ టెండుల్కర్‌ను కలిసి గోల్డెన్‌ టికెట్‌ను అందజేసి, ప్రపంచకప్‌ను వీక్షించేందుకు రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీసీసీఐ ట్వీట్‌ చేసింది. గోల్డెన్‌ టికెట్‌ ఫర్‌ ఇండియా ఐకాన్స్‌లో కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ కార్యదర్శి జైషా భారత రత్న సచిన్‌ టెండుల్కర్‌కు గోల్డెన్‌ టికెట్‌ బహుకరించారని ట్వీట్‌ చేసింది. సచిన్‌ ఎన్నో క్రికెట్‌ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిచ్చిందని, ఇప్పుడు ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భాగమై.. ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షిస్తాడని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉండగా.. ఐసీసీ మెగా టోర్నీ అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్‌ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరుగనుండగా.. భారత జట్టు తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో అక్టోబర్‌ 8న చెన్నైలో ఢీ కొట్టబోతున్నది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.

Tags:    

Similar News