Rohit Sharma : వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్
వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో లీగ్ దశలో టీమ్ఇండియా మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడనుంది. స్వదేశంలో ప్రపంచకప్ జరగనుండడంతో భారత్ విజయం సాధించాలని సగటు క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. మూడో సారి, స్వదేశంలో రెండో సారి కపును సాధించడమే లక్ష్యంగా రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.
వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ‘స్వదేశంలో ప్రపంచకప్ ఆడనుండడం గొప్ప అనుభూతి. 12 సంవత్సరాల క్రితం ఇండియా ప్రపంచకప్‌ను గెలిచింది. దీంతో ఈ సారి ఎలాగైన భారత్ ప్రపంచకప్‌ను గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆటలో చాలా మార్పులు రావడం, వేగంగా ఆడడంతో పాటు టీమ్‌లు సానుకూల ధృక్పథంతో ఆడతుండడంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఈ టోర్నీ కోసం మేము సిద్ధం అవుతున్నాము. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తాం.’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. మొదటి, నాలుగో స్థానంలో నిలిచిన జట్ల మధ్య నవంబర్ 15న ముంబైలోని వాంఖడే వేదికగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్ రెండింటికీ రిజర్వ్ డేలను ఐసీసీ ప్రకటించింది.
Read More..
ODI World Cup 2023: 'అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు అతడి కోసం గెలవాలి'