భారత గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డి కాక్ రికార్డ్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 23వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగింది.

Update: 2023-10-25 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 23వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు 149 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో తన 150వ మ్యాచ్ ఆడిన డి కాక్.. కేవలం 140 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 382 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తో డి కాక్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో భారత గడ్డపై డి కాక్ చేసిన 174 పరుగులే ఇప్పుడు అత్యధిక వ్యక్తిగత స్కోరు గా నిలిచింది. అతనికి ముందు భారత్ గడ్డపై ఏ సౌతాఫ్రికా ప్లేయర్ ఇంత మొత్తంలో స్కోర్ చేయలేదు.

Tags:    

Similar News