ఇండియా vs న్యూజిలాండ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ సీజన్ లో వరుస విజయాలతో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి న్యూజిలాండ్ జట్టుపై పగ తీర్చు కోవాలని చూస్తుంది. అలాగే న్యూజిలాండ్ జట్టు కూడా భారత్ పై గెలిచి.. 2019 వరల్డ్ కప్ లాగే ఫైనల్ చేరాలనే తపనతో ఉంది. ఇరుజట్లు మధ్య టఫ్ పైట్ జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. అయితే వాంఖడే స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఎవరు గెలిచి ఫైనల్ చేరుతారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు చూడాల్సిందే. కాగా ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(సి), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(w), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్