World Cup 2023 : 'ఆ రెండు మ్యాచ్‌లు గెలిస్తే టీమ్ ఇండియాదే వరల్డ్ కప్'

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లపై విజయం సాధిస్తే టీమిండియా సునాయసంగా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.

Update: 2023-07-03 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లపై విజయం సాధిస్తే టీమిండియా సునాయసంగా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో టీమిండియా అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే టీమిండియాకు తిరుగుండదని గవాస్కర్ ఓ చానెల్‌తో మాట్లాడుతూ తెలిపాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లపై గెలిస్తే మిగిలిన జట్లను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి పెద్ద జట్లను సొంతగడ్డపై ఓడించేందుకు ఏం చేయాలో టీమిండియాకు బాగా తెలుసు. బలమైన ప్రత్యర్థులను తొలుత ఎదుర్కొంటే, ఆ తర్వాత బలహీనమైన జట్లతోనే మ్యాచులు ఉంటాయి. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ మాత్రం పనికి రాదు.సెమీస్‌లో గెలిస్తే, అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవ్వరైనా ఓడించడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నా.' అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Read more : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డీడీ స్పోర్ట్స్

Tags:    

Similar News