ICC World Cup 2023: చరిత్ర సృష్టించిన కుశాల్‌ మెండిస్‌..

ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కుశాల్‌ మెండిస్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

Update: 2023-10-10 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కుశాల్‌ మెండిస్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెండిస్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్‌.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం 33 ఓవర్‌లకు 4 వికెట్లు కోల్పోయి 239 రన్స్ చేసింది. సదీర సమరవిక్రమ (49), ధనంజయ డి సిల్వా (49) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News