IND vs PAK : దాయాదిని దంచేశారు.. కీలక పోరులో భారత్ ఘన విజయం
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అదేవిధంగా శ్రేయాస్ అయ్యర్ (53; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కే.ఎల్ రాహుల్ (19; 29 బంతుల్లో 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిదీ 2 వికెట్లు, హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో టాప్ స్కోరర్లుగా బాబర్ ఆజమ్ (50; 58 బంతుల్లో 7 ఫోర్లు), మహమ్మద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో 7 ఫోర్లు) నిలిచారు. భారత్ బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. 7 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లను తీసిన జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.