దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా రోహిత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇక రెండు ఎడిషన్స్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు.
సచిన్ 1996, 2003 ప్రపంచకప్‌లో 500 రన్స్ చేయగా.. రోహిత్ శర్మ 2019, 2023 ప్రపంచకప్‌ల్లో వరుసగా 500 ప్లస్ రన్స్ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న తాజా మ్యాచ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 14,000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్ అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. సింగిల్ ఎడిషన్ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు బాది ఏబీ డివిలియర్స్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక ఫోర్లు బాదిన కెప్టెన్‌గానూ రోహిత్ చరిత్రకెక్కాడు.