World Cup 2023 : 'అతడి విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Update: 2023-07-03 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. మరో నాలుగు నెలల్లో భారత్‌ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు యజ్వేంద్ర చహల్‌ను ఆడించడం ఉత్తమమని.. అతను ప్రభావం చూపే అవకాశం ఉంటుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. యజ్వేంద్ర చహాల్‌ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీ రోల్ పోషించారు.. 2011 వన్డే వరల్డ్ కప్‌లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు అంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు.

Read more : World Cup 2023 : 'ఆ రెండు మ్యాచ్‌లు గెలిస్తే టీమ్ ఇండియాదే వరల్డ్ కప్

Tags:    

Similar News