బెంగళూరు : వన్డే ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఫీల్డర్‌గా నిలిచాడు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రతిసారిలాగే ఈ సారి కూడా విన్నర్‌ను విభిన్న తరహాలో ప్రకటించాడు. అవార్డు కోసం కేఎల్ రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా పోటీపడగా.. సూర్యకుమార్ విన్నర్‌గా నిలిచాడు.
బిగ్ స్ర్కీన్‌పై సూర్యకుమార్ పేరును రివీల్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ త్రోడౌన్ స్పెషలిస్ట్ కోచ్ నువాన్ సెనెవిరత్నే అవార్డును సూర్య మెడల్ వేశాడు. బెస్ట్ ఫీల్డర్ అవార్డు గెలుచుకోవడం పట్ల సూర్య ఆనందం వ్యక్తం చేశాడు. ‘దాదాపు ఏడాది నుంచి దిలీప్ నా ఫీల్డింగ్‌ను మెరుగుపర్చాడు. ఇది దానికి ప్రతిఫలం’ అని తెలిపాడు. మరోవైపు, బుధవారం ముంబై వేదికగా జరిగే సెమీస్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సోమవారం ముంబైకి చేరుకున్నారు.