దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023కు గురువారం ఆక్టోబర్ 5 తెరలేచింది. అహ్మాదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ సెమీఫైనల్‌కు చెరే నాలుగు జట్లను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కకర్ ఎంచుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీ ఫైనల్ ఫేవరేట్లగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎంపిక చేశాడు. భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టు కూడా చాలా సమతుల్యంగా ఉందని తెలిపాడు. కచ్చితంగా టీమిండియా సెమీస్‌కు చేరుతోంది.
అదే విధంగా ఆసీస్ కూడా అత్యుత్తమంగా ఉంది. కాబట్టి వారు సెమీఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉందన సచిన్ అభిప్రాయపడ్డారు. ఇక మూడో జట్టుగా డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లీష్ జట్టు కూడా మరోసారి టైటిల్ బరిలో ఉంటుందని సచిన్ తెలిపారు. ఇక నా నాల్గువ జట్టుగా న్యూజిలాండ్‌ను ఎంపిక చేశారు. కివీస్ వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో న్యూజిలాండ్ ఎల్లప్పుడూ బాగా రాణిస్తుంది. కివీస్ కూడా కచ్చితంగా టాప్-4లో ఉంటుందని" ఐసీసీ డిజిటిల్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పేర్కొన్నాడు.