ICC World Cup -2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..
ఐసీసీ వరల్డ్ కప్-2023 కర్టన్ రైజర్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గత వరల్డ్ కప్ ఫైనలిస్టులైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది.
దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వరల్డ్ కప్-2023 కర్టన్ రైజర్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గత వరల్డ్ కప్ ఫైనలిస్టులైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత వరల్డ్ కప్ జరిగిన పరాభవానికి న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ ఓడించేందుకు అస్త్రశస్రాలను సిద్ధం చేసుకుంది. మరోవైపు ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో గెలుపొంది, టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
న్యూజిలాండ్ జట్టు : డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్, కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మెన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, మ్యాచ్ హెన్రీ, ట్రెంట్ బోల్ట్.
ఇంగ్లాండ్ జట్టు : జానీ బెయిర్‌స్టో, డెవిడ్ మాలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.