దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అంతర్జాతీయ వన్డేల్లో చరిత్ర సృష్టించాడు. బంగ్లా క్రికెటర్ తౌహిద్ హృదోయ్ వికెట్ తీసి.. 200వ వికెట్ క్లబ్‌లో చేరాడు. తక్కువ మ్యాచ్‌లలోనే 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ మైలురాయిని చేర్చుకున్న కివీస్ తొలి బౌలర్‌గా బౌల్ట్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ వన్డే హిస్టరీలో తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు.
తక్కువ మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు..
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 102
సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 104
ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్)- 107
బ్రెట్ లీ(ఆస్ట్రేలియా)- 112
అలెన్ డొనాల్డ్(సౌతాఫ్రికా)- 117
వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని తక్కువ బంతుల్లో అందుకున్నది వీళ్లే..
మిచెల్ స్టార్క్- 5240
సక్లెయిన్ ముస్తాక్- 5451
బ్రెట్ లీ- 5640
ట్రెంట్ బౌల్ట్- 5783