ICC World Cup 2023: చిత్తైన బాబర్ గ్యాంగ్.. ఆసీస్‌కు రెండో విజయం

Update: 2023-10-20 16:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభం దక్కినా మిడిలార్డర్‌ వైఫల్యంతో పాకిస్తాన్‌ ఓటమిపాలైంది. భారీ ఛేదనలో 45.3 ఓవర్లలో 305 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కంగారూలు.. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి ఈ మెగా టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్నారు. పాక్‌కు ఇది నాలుగు మ్యాచ్‌లలో రెండో ఓటమి. ఆసీస్‌ బౌలర్లలో జంపా 4 కీలక వికెట్లు తీసి పాక్‌ పతనాన్ని శాసించాడు. కమిన్స్‌, స్టోయినిస్‌ తలా 2 వికెట్లు తీయగా.. స్టార్క్‌, హెజిల్‌వుడ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (124 బంతుల్లో 163, 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (108 బంతుల్లో 121, 10 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా.. 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో షహీన్‌ షా అఫ్రిది మినహా మిగిలినవారంతా తేలిపోయారు. ముఖ్యంగా ఉసామా మిర్‌, హరీస్‌ రౌఫ్‌లు అయితే ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. షహీన్‌ షా అఫ్రిది 5 వికెట్లు పడగొట్టాడు. పాక్ బౌలర్‌లో షాహీన్ అఫ్రిది 5 వికెట్లు తీయగా.. హరీస్ రవూఫ్ 3, ఉసామా మీర్ 1 వికెట్లు పడగొట్టారు.

Tags:    

Similar News