2023 Cricket World Cup : వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే

వన్డే ప్రపంచ కప్ 2023లో ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్టు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో తలపడనున్నాయి.

Update: 2023-11-17 13:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023లో ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్టు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో తలపడనున్నాయి. దాదాపు ఒక లక్ష నలబై వేల సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడటం అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచుకు అంపైర్లును ఐసీసీ నిర్ణయించింది.

హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సమ్మిట్ క్లాష్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్)లను ఐసిసి ప్రకటించింది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్‌కు ఇద్దరు ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఇల్లింగ్‌వర్త్ ఒకరు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీఫైనల్‌లో కెటిల్‌బరో అంపైర్గా వ్యవహరించారు. ఫైనల్‌కు జోయెల్ విల్సన్ (వెస్టిండీస్), క్రిస్టోఫర్ గఫానీ (న్యూజిలాండ్) థర్డ్ , ఫోర్త్ అంపైర్లు గా ఉంటారు. విల్సన్, గఫానీలు భారత్ వర్సెస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా సెమీఫైనల్స్‌కు థర్డ్ అంపైర్లుగా ఉన్నారు.

Tags:    

Similar News