CWC Qualifier 2023: స్కాట్లాండ్‌ హ్యాట్రిక్‌ విజయం..

CWC Qualifier 2023లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసింది.

Update: 2023-06-25 16:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifier 2023లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసింది. ఒమన్‌‌పై 76 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (136) సూపర్‌ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ రిచీ బెర్రింగ్టన్‌ (60) అర్ధసెంచరీతో రాణించాడు.

ఒమన్‌ బౌలర్లలో.. బిలాల్‌ ఖాన్‌ 5 వికెట్లు తీయగా.. ఫయాజ్‌ బట్‌ 2, జే ఒడేడ్రా ఓ వికెట్‌ తీశారు. అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. వికెట్‌ కీపర్‌ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్‌పై విజయం సాధించడంతో స్కాట్లాండ్‌ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్‌ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది.


Similar News