‘వింటేజ్ ఆసీస్ బ్యాక్’.. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డ్
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్- 2023 ప్రారంభంలో తడబడ్డ ఆస్ట్రేలియా.. క్రమంగా పుంజుకుంది. వరల్డ్ కప్ స్టారింగ్‌లోనే సౌతాఫ్రికా, భారత్ చేతిలో ఘోర పరాజయం పాలై డీలాపడ్డ
దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్- 2023 ప్రారంభంలో తడబడ్డ ఆస్ట్రేలియా.. క్రమంగా పుంజుకుంది. వరల్డ్ కప్ స్టారింగ్‌లోనే సౌతాఫ్రికా, భారత్ చేతిలో ఘోర పరాజయం పాలై డీలాపడ్డ కంగారులు ఆ తర్వాత గేర్ మార్చారు. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి దూసుకొచ్చారు. ఇవాళ, ధర్మశాల వేదికగా న్యూజిల్యాండ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లోనూ ఆసీస్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కగా.. చివర్లో మ్యాక్స్‌వెల్, కమ్మిన్స్ మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియా 388 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కాగా, ఇవాళ న్యూజిలాండ్‌పై భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వన్డే ప్రపంచక కప్ చరిత్రలో వరుసగా 3 మ్యాచుల్లో 350+ స్కోర్లు సాధించిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లోకెక్కింది. ఈ వర్డల్ కప్‌లో ఆస్ట్రేలియా ఆడిన చివరి మూడు మ్యాచుల్లో పాకిస్థాన్‌పై 367, నెదర్లాండ్స్‌పై 399, న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతోన్న మ్యాచులో 388 పరుగులు చేసి వన్డే ప్రపంచ కప్ హిస్టరీలో కొత్త రికార్డ్‌ను ఆసీస్ తన పేరిట లిఖించుకుంది. ఆస్ట్రేలియా భారీ స్కోర్లు చేస్తూ వరుస విజయాలు సాధిస్తుండటంతో.. ‘వింటేజ్ ఆసీస్ బ్యాక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.