World Cup 2023 : రేపు వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్!

ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-06-26 13:37 GMT

న్యూఢిల్లీ : ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను నేడు ఐసీసీ, బీసీసీఐ సంయుక్తంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ముంబై‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేయనున్నట్టు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో బీసీసీఐ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి అందజేసింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) షెడ్యూల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్‌ల వేదికలు ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని వాదించింది.

అహ్మదాబాద్ వేదికగా టీమ్ ఇండియాతో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో, ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నయ్ వేదికగా పాక్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వేదికలను మార్చాలని డిమాండ్ చేసింది. అయితే, మార్పులకు ఐసీసీగానీ, ఆతిథ్య హక్కులు కలిగిన బీసీసీఐగానీ ఒప్పుకోలేదు. అంతేకాకుండా, పీసీబీ సొంత దేశ మాజీ క్రికెటర్ల నుంచే విమర్శలు ఎదుర్కొంది. ఇక, చేసేదేం లేక పీసీబీ వరల్డ్ కప్ షెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది. ‘ఐసీసీ ఈవెంట్‌లో ప్రపంచకప్ షెడ్యూల్‌ మంగళవారం విడుదల కానుంది. షెడ్యూల్‌ను పీసీబీ అంగీకరించింది. ఎలాంటి మార్పులు చేయడం లేదు’ అని సదరు అధికారి తెలిపారు.


Similar News