World Cup 2023: వన్డే ప్రపంచకప్‌.. టికెట్ల విక్రయం ఎప్పటినుంచంటే?

వరల్డ్ కప్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ వెల్లడించింది.

Update: 2023-08-09 16:39 GMT

న్యూఢిల్లీ : వరల్డ్ కప్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి టికెట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని, రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా టికెట్ల వివరాలను పొందవచ్చని పేర్కొంది. ఈ-టికెట్ అవకాశం లేదని, అభిమానులు టికెట్ సెంటర్ల వద్ద టికెట్లను పొందాల్సి ఉంటుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దశలవారీగా టికెట్లను అమ్మనున్నట్టు ఐసీసీ తెలిపింది.

ఆగస్టు 25న నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్ ఇండియా ఈవెంట్ మ్యాచ్‌ల టికెట్ అమ్మకాలు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 30న టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్‌ల టికెట్లు సేల్‌లో ఉండనున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 మధ్య టీమ్ ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లను విక్రయించనున్నారు.


Similar News