World Cup 2023: వన్డే ప్రపంచకప్‌.. ఐసీసీ కీలక అప్‌డేట్‌

World Cup 2023 భారత్‌ వేదికగా ఆక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2023-06-25 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: World Cup 2023 ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ డ్రాఫ్ట్​షెడ్యూల్‌ ప్రకారం.. ఈ మెగా టోర్నీ ఆక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ క్రమంలోనే టోర్నీలో పాల్గొనే జట్లు.. తమ పూర్తి వివరాలను ప్రకటించడానికి ఆగస్టు 29వ తేదీని డెడ్‌లైన్‌గా విధించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఆయా క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేయడానికి, వాటికి సంబంధించిన వివరాలను సమర్పించడానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.


Similar News