World cup-2023 : నాలుగో స్థానానికి అతడే కరెక్ట్.. వీరేంద్ర సేహ్వాగ్
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటికే టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో తలపడబోతోంది.
దిశ, వెబ్ డెస్క్ : వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటికే టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో తలపడబోతోంది. ఈ క్రమంలో భారత జట్టులో నాలుగో స్థానంపై అప్పుడే చర్చ మొదలైంది. అత్యంత కీలకమైన టోర్నీలో నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఆడించాలని భారత డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ నిలకడగా ఆడాడని, సెంచరీ కూడా చేశాడని గుర్తు చేశాడు. టాపార్డర్ విఫలమైనప్పుడు నాలుగో స్థానంలో వచ్చిన వారు వికెట్లను కాపాడుతూ, నిలకడగా పరుగులు చేయాల్సి ఉంటుందన్నాడు. ప్రస్తుతానికి అతడిని అదే స్థానంలో కొనసాగిస్తే జట్టుకు శ్రేయస్కరమని అన్నాడు. అదేవిధంగా చివరి 15 ఓవర్లలో దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌ను బ్యాటింగ్‌కు పంపితే.. జట్టు భారీ స్కోర్లు సాధించడం ఖాయమని అన్నాడు.