World Cup Qualifiers 2023: ఒమన్‌‌పై విండీస్ విజయం..

World Cup Qualifiers 2023లో వెస్టిండీస్‌ జట్టు సూపర్‌ సిక్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

Update: 2023-07-05 16:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: World Cup Qualifiers 2023లో వెస్టిండీస్‌ జట్టు సూపర్‌ సిక్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్‌, ఒమన్‌ల మధ్య మ్యాచ్‌‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే వెస్టిండీస్‌కు ఈ విజయం ఊరట మాత్రమే. ఇప్పటికే వరల్డ్‌కప్‌ అర్హత అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఒమన్‌ బ్యాటర్స్‌లో సూరజ్‌ కుమార్‌ (53) పరుగులు నాటౌట్‌, షోయబ్‌ ఖాన్‌ (50) పరుగులతో రాణించగా.. అయాన్‌ ఖాన్‌ (30), కశ్యప్‌ (31) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ 3 వికెట్లు తీయగా.. కైల్‌ మేయర్స్‌ 2, కెవిన్‌ సింక్లెయిర్‌ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 39.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. బ్రాండన్‌ కింగ్‌ (104 బంతుల్లో 100 పరుగులు) సెంచరీతో మెరవగా.. కెప్టెన్‌ షెయ్‌ హోప్‌ 63 నాటౌట్‌, పూరన్‌ 19 పరుగులు నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు.


Similar News