World Cup 2023: వరల్డ్ కప్ టీంలో సన్‌రైజర్స్ స్టార్‌కు మొండిచెయ్యి.. కారణం అదే?

క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కూడా వరల్డ్ కప్‌లో రాణించాలని అనుకుంటాడు.

Update: 2023-08-17 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కూడా వరల్డ్ కప్‌లో రాణించాలని అనుకుంటాడు. కానీ చాలా మందికి ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం రాదు. ట్యాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాక వరల్డ్ కప్‌లో ఆడలేకపోతారు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హ్యారీ బ్రూక్ విషయంలో అదే జరిగింది. ఈ ఇంగ్లండ్ యువ కెరటం ఇటీవల జరిగిన యాషెస్ సిరీసులో అద్భుతంగా రాణించాడు. కానీ తాజాగా ఇంగ్లండ్ ప్రకటించిన వన్డే టీంలో చోటు కోల్పోయాడు. న్యూజిల్యాండ్‌తో జరిగే వన్డే సిరీసుతోపాటు వరల్డ్ కప్ ఆడే టీంను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జాబితాలో బ్రూక్ పేరు లేదు.

ఈ మెగా ఈవెంట్ కోసమే వెటరన్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్‌మెంట్ వెనక్కు తీసుకున్నాడు కూడా. ఈ కారణంగానే బ్రూక్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టాన్ అభిప్రాయపడ్డాడు. స్టోక్స్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకున్న తర్వాత బ్రూక్‌ను ఆడించడం కుదరదని ఆథర్టాన్ స్పష్టం చేశాడు.

మంచి ఫామ్‌లో ఉన్న బ్రూక్‌ను పక్కన పెట్టడం సాధారణ ఫ్యాన్స్‌కు షాకింగ్‌గా అనిపించొచ్చని, కానీ స్టోక్స్ వంటి సీనియర్ ప్లేయర్‌ రీఎంట్రీ ఇవ్వడం వల్లనే బ్రూక్‌కు అవకాశం దక్కలేదని ఆథర్టాన్ వివరించాడు. టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్న బ్రూక్.. ఇప్పటి వరకు వైట్ బాల్ క్రికెట్‌లో అంత గొప్పగా ఆకట్టుకోలేదు. ఇది కూడా అతన్ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం కావొచ్చు.


Similar News