CWC Qualifiers 2023 : గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ సిక్స్‌‌లో శ్రీలంక.. స్కాట్లాండ్‌‌పై విజయం

CWC Qualifiers 2023లో భాగంగా గ్రూప్‌-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

Update: 2023-06-27 14:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా గ్రూప్‌-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 4 మ్యాచ్‌లో నాలుగ విజయాలు సాధించిన లంక 8 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ సిక్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ పాతుమ్‌ నిస్సాంక (75) రన్స్ చేయగా.. చరిత్‌ అసలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో.. క్రిస్‌ గ్రీవ్స్‌ 4 వికెట్లు తీయగా.. మార్క్‌ వాట్‌ 3, క్రిస్‌ సోల్‌ 2, ఎవన్స్‌ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం బరిలోకి స్కాట్లాండ్‌ 29 ఓవర్లలోనే 163 పరుగులకు ఆలౌట్‌ అయింది. క్రిస్‌ గ్రీవ్స్‌ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. లంక బౌలర్లలో.. మహీష్‌ తీక్షణ 3 వికెట్లతో రాణించగా.. హసరంగా 2, కాసున్‌ రజిత, లాహిరు కుమారా, దాసున్‌ షనకలు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.


Similar News