WorldCup: రోహిత్ శర్మ సంచలన రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘతన సాధించారు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ మ్యాన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘతన సాధించారు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ మ్యాన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. తాజాగా.. ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ తన సత్తాను చాటాడు. 40 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒక ఏడాదిలో 50 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయంగా చూస్తే రోహిత్ కంటే ముందు సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివీలియర్స్(58), వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్(56) మాత్రమే ఉన్నారు. గత రాత్రి న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో హెన్రీ వేసిన రెండో ఓవర్‌లో కొట్టిన సిక్సర్‌తో రోహిత్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.