టీ20ని తలపిస్తున్న ఇండియా, ఆఫ్ఘాన్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ సెంచరీ
వరల్డ్ కప్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. సెంచరీతో చెలరేగాడు. కేవలం 60 బంతుల్లోనే నాలుగు సిక్సులు, 12 ఫోర్లతో ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్ శర్మకు తోడు ఇషాన్ కిషన్ కూడా అదరగొట్టాడు.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆప్ఘనిస్తాన్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అవుతుందని అందరూ భావించారు. కానీ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆప్ఘనిస్తాన్ నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఒక దశలో ఆప్ఘనిస్తాన్ 300 స్కోరు చేసేలా కనిపించింది. అయితే టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తన బౌలింగ్‌లో పదును చూపెట్టడంతో 272 పరుగులకే పరిమితమైంది.