ICC World Cup 2023: చరిత్రలో ఏం జరిగిందో కాదు.. వరల్డ్‌ కప్‌ గెలువడంపైనే దృష్టి : రోహిత్‌ శర్మ

Update: 2023-11-14 15:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భారత జట్టు వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో బుధవారం తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా జట్టు వాతావరణం, బౌలింగ్‌ తదితర అంశాలపై స్పందించాడు. ‘మొదటి మ్యాచ్‌ నుంచి చివరి మ్యాక్‌ వరకు ప్రపంచకప్‌ ఆడిన సమయంలో ఒత్తిడి ఉంటుంది. కానీ జట్టు ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం అభినందనీయం’ అని పేర్కొన్నారు. ఆరో బౌలర్‌ ఎంపికపై స్పందిస్తూ ‘హార్దిక్‌ గాయపడ్డ వెంటనే మా కలయిక మారిపోయింది. మొదటి మ్యాచ్‌ నుంచి ఇతర ఆటగాళ్లను బౌలింగ్‌ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. ముందస్తుగా ఒకరిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం’ తెలిపాడు.

‘జట్టులోని ఆటగాళ్లెవరూ 1983లో భారత్‌ తొలిసారిగా ప్రపంచకప్‌ గెలిచినప్పుడు పుట్టలేదు. 2011లో గెలిచిన సమయంలో సగం మంది ఆడలేదు. గతంలో వరల్డ్‌ కప్‌లను మనం ఎలా గెలుచుకున్నాం అనే దాని గురించి వారు మాట్లాడుకోవడం నాకు కనిపించలేదు. మనం ఎలా మెరుగ్గా ఉండగలం.. ఎలా మెరుగుపడగలం అనేదానిపై దృష్టి ఉంది. మొదట మ్యాచ్ నుంచి దృష్టి గెలవడంపైనే ఉంది. ఒకరిద్దరు ఆటగాళ్లతో ఏం చేయలేం. సహాయక సిబ్బందితో సహా అందరూ సహకరించారు.’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. రేపు జరుగబోయే మ్యాచ్‌కు సంబంధించి టాస్‌పై స్పందిస్తూ.. ‘నేను ఇక్కడ చాలా క్రికెట్‌ ఆడాను. గత నాలుగైదు మ్యాచ్‌లలో వాంఖడే అంటే ఏంటో నాకు తెలియదు. కాబట్టి టాస్‌పై పట్టింపు లేదు’ అని తెలిపాడు.


Similar News