CWC Qualifiers 2023 : గెలిచినా లాభం లేదు.. క్వాలిఫయింగ్‌ రేసులో ఆ రెండు జట్లు

CWC Qualifiers 2023లో భాగంగా గ్రూప్‌-బిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌‌కు ఓదార్పు విజయం దక్కింది.

Update: 2023-06-27 16:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా గ్రూప్‌-బిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌‌కు ఓదార్పు విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో యూఏఈపై 138 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ గెలిచినా ఐర్లాండ్‌కు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐర్లాండ్‌, ఒమన్‌లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక స్కాట్లాండ్‌పై గెలిచిన శ్రీలంక నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ సిక్స్‌లో అడుగుపెట్టింది. 6 పాయింట్లతో స్కాట్లాండ్‌ రెండో స్థానంలో, ఒమన్‌ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో సూపర్‌సిక్స్‌కు అర్హత సాధించాయి.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బ్యాటర్స్‌లో.. పాల్‌ స్టిర్లింగ్‌ 134 బంతుల్లో 162 పరుగులతో భారీ ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ ఆండ్రూ బాల్బర్ని (66), హ్యారీ టెక్టర్‌ (57) పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 39 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ ముహ్మద్‌ వసీమ్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సంచిత్‌ శర్మ (44), బాసిల్‌ హమీద్‌ (39) పరుగులు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో.. కర్టిస్‌ కాంఫర్‌, జార్జ్‌ డొక్రెల్‌, ఆండీ మెక్‌బ్రైన్‌ జోషువా లిటిల్‌లు తలా 2 వికెట్లు తీశారు.


Similar News