ICC Worl cup-2023 : ఈ వరల్డ్ కప్ లో ఆ ముగ్గురే టాప్ స్కోరర్లు : గౌతమ్ గంభీర్
రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023కి అన్ని జట్లు ఇప్పటికే సమయత్తమవుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ - 2023కి అన్ని జట్లు ఇప్పటికే సమయత్తమవుతున్నాయి. టోర్నీలో ప్రత్యర్థి జట్లను ఎలా కట్టడి చేయాలో ఇప్పటి నుంచే పథకాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ఈవెంట్‌లో గత వరల్డ్ కప్ ఐదు శతకాలు చేసిన రోహిత్‌శర్మ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని తెలిపాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా అత్యధిక పరుగులు సాధిస్తాడని పేర్కొన్నారు. టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా బాబర్ ఆజామ్ అత్యధిక పరుగుల సాధిస్తాడని జోస్యం చెప్పాడు.