ICC World Cup 2023 : పేరుకే హైదరాబాద్.. బీసీసీఐకి ఎందుకింత వివక్ష..?

ICC World Cup 2023 సంబంధించి ఇవాళ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.

Update: 2023-06-27 14:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023 సంబంధించి ఇవాళ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. 10 స్డేడియాల్లో మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. అయితే ఇందుల్లో హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియానికి చోటు దక్కింది కానీ, టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లు లేకపోవడంతో.. తెలుగు గడ్డపై బీసీసీఐ వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐపై హైదరాబాద్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. భారత్ ఆడే ఒక్క మ్యాచ్‌కు కూడా ఉప్పల్ స్టేడియం వేదిక కాలేదు.

ఇక్కడ పాకిస్తాన్‌ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్‌ ఒక మ్యాచ్‌ ఆడనున్నాయి. అయితే ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్‌లు క్వాలిఫయర్స్‌తోనే షెడ్యూల్‌ చేయడం అభిమానులకు కోపం తెప్పించింది. ఇంతదానికి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు పెట్టడం ఎందుకు..? హైదరాబాద్‌పై బీసీసీఐకి ఎందుకింత వివక్ష అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

వరల్డ్ కప్ 2023 టోర్నీకి 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మరో రెండు జట్లు జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధించనున్నాయి. ఆ రెండు జట్ల మ్యాచులే ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా అక్టోబర్ 6న పాకిస్తాన్ - క్వాలిఫైయర్ 1జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 9న న్యూజిల్యాండ్- క్వాలిఫైయర్-1 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 12న పాకిస్తాన్ - క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.


Similar News