టీమిండియా ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన వార్నర్
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ముగిసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ముగిసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది.
ఇదిలా ఉండగా.. సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆస్ట్రేలియా బ్యాటర్ డెవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా కప్ పట్టుకున్న ఫొటో పోస్ట్ చేశాడు. దీనికి భారత అభిమానులు స్పందిస్తూ.. ‘డియర్ వార్నర్.. నువ్వు మా కోట్లాది హృదయాలను ముక్కలు చేశావ్. ఎనీ వే కంగ్రాట్స్’ అని కామెంట్లు చేశారు. దీనికి వార్నర్ స్పందిస్తూ.. క్షమించాలని కోరారు. వరల్డ్ కప్‌కు ఇండియా అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. గొప్ప వాతావరణంలో మ్యాచ్ జరిగింది. అదరికీ థాంక్స్ అని వార్నర్ చెప్పారు.