తవ్వకాల్లో.. బయటపడ్డ శిలాయుగం ఆనవాళ్లు

దిశ, వెబ్‌డెస్క్: పురాతన కాలం నాటి శిలాజాలు, వస్తు అవశేషాల కోసం ఎప్పట్నుంచో తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి దేశం తమ పూర్వీకుల సంస్కృతి, నాగరికత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ మేరకు ఆయా దేశాల పురావస్తు శాఖలు పలు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిస్తూ ఉంటాయి. తాజాగా సౌదీ పురావస్తు శాఖ శాస్త్రీయ బృందం జరిపిన తవ్వకాల్లో ఆదిమవాసులు వాడిన రాతి పనిముట్లు దొరికాయి. సౌదీ హెరిటేజ్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీలోని షుయిబ్ అల్-అడ్గం ప్రాంతంలో […]

Update: 2021-01-02 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: పురాతన కాలం నాటి శిలాజాలు, వస్తు అవశేషాల కోసం ఎప్పట్నుంచో తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి దేశం తమ పూర్వీకుల సంస్కృతి, నాగరికత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ మేరకు ఆయా దేశాల పురావస్తు శాఖలు పలు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిస్తూ ఉంటాయి. తాజాగా సౌదీ పురావస్తు శాఖ శాస్త్రీయ బృందం జరిపిన తవ్వకాల్లో ఆదిమవాసులు వాడిన రాతి పనిముట్లు దొరికాయి.

సౌదీ హెరిటేజ్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీలోని షుయిబ్ అల్-అడ్గం ప్రాంతంలో మధ్యప్రాచీన శిలాయుగానికి చెందిన అరుదైన రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. నాటి ఆదిమవాసులు రాయితో గొడ్డళ్లు, ఇతర పనిముట్లు తయారు చేసినట్లు వీటి ద్వారా అంచనాకు రావచ్చు. ఇవి 2 లక్షల ఏళ్ల కిందట తయారు చేసినవని ఆఫీసర్లు చెబుతున్నారు. గుంపులుగా ఉండే ఆనాటి ప్రజలు(మానవ సమూహాలు) ఈ ప్రాంతంలో ఉన్న గుట్టలు, రాళ్లను తమకు అనుగుణంగా మార్చుకొని సమృద్ధిగా రాతి పనిముట్లు తయారు చేసుకొని ఉంటారని, వాటితో ఆహార వేటకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. వీరు ఈ ప్రాంతం నుంచి అరేబియన్ ద్వీపకల్పం గుండా ఇతర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశముందని చెబుతున్నారు. పురాతన కాలంలో ద్వీపకల్పంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నదులనే మార్గాలుగా ఎంచుకున్నట్లు ఆధారాలు లభించాయి.

Tags:    

Similar News