రికార్డు సృష్టించిన ఐపీఎల్
దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ సమయంలో క్రికెట్ లైవ్ స్పోర్ట్ లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇంగ్లాండ్‌లో క్రికెట్, వెస్టిండీస్‌లో సీపీఎల్ జరిగినా భారతీయ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)ను ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెప్టెంబర్ 19న ముంబై-చెన్నై మధ్య తొలి మ్యాచ్ రికార్డు సృష్టించింది. కేవలం టీవీల్లోనే 20 కోట్ల మంది ఈ […]
దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ సమయంలో క్రికెట్ లైవ్ స్పోర్ట్ లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇంగ్లాండ్‌లో క్రికెట్, వెస్టిండీస్‌లో సీపీఎల్ జరిగినా భారతీయ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)ను ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెప్టెంబర్ 19న ముంబై-చెన్నై మధ్య తొలి మ్యాచ్ రికార్డు సృష్టించింది. కేవలం టీవీల్లోనే 20 కోట్ల మంది ఈ మ్యాచ్ చూశారని బీసీసీఐ కార్యదర్శి జైషా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
‘బార్క్ రేటింగ్ ప్రకారం ఇండియాలో 20 కోట్ల మంది టీవీల్లో ఐపీఎల్ తొలి మ్యాచ్ వీక్షించారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ క్రీడకు అయినా ఇదే అత్యధిక సంఖ్య’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇది కేవలం టీవీల్లో చూసిన భారతీయ ప్రేక్షకుల సంఖ్య మాత్రమే. ఇది కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో చూసిన ప్రేక్షకుల సంఖ్య, హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై చూసిన వారి సంఖ్యను కూడా కలిపితే మరో 10 కోట్ల మంది ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.