మెదక్‌లో ఘోర రోడ్డుప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండటం దండుపల్లి దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..చిన్నశంకరం పేటకు చెందిన వెంకటేశ్, శ్రీకాంత్ నాగ్‌పూర్ హైవే మీదుగా వెళ్తుండగా అటు వైపుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల […]

Update: 2020-07-10 09:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండటం దండుపల్లి దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..చిన్నశంకరం పేటకు చెందిన వెంకటేశ్, శ్రీకాంత్ నాగ్‌పూర్ హైవే మీదుగా వెళ్తుండగా అటు వైపుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News