చల్లారని ఢిల్లీ..
దిశ, ఢిల్లీ : సీఏఏ(పౌర చట్టం)వ్యతిరేక అల్లర్లు దేశ రాజధానిలో ఇంకా చల్లబడినట్టు కనిపించడం లేదు.ఢిల్లీలోని ఈశాన్య, తూర్పు ప్రాంతంలో ఈనెల 25న జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరగా 200మందికి పైగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ అల్లర్లలో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పలువురిపై కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు 130 మంది ఆందోళన కారులను అరెస్టు చేయగా,వీటికి ప్రధాన కారకులు 48మందిపై […]
దిశ, ఢిల్లీ :
సీఏఏ(పౌర చట్టం)వ్యతిరేక అల్లర్లు దేశ రాజధానిలో ఇంకా చల్లబడినట్టు కనిపించడం లేదు.ఢిల్లీలోని ఈశాన్య, తూర్పు ప్రాంతంలో ఈనెల 25న జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరగా 200మందికి పైగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ అల్లర్లలో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పలువురిపై కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు 130 మంది ఆందోళన కారులను అరెస్టు చేయగా,వీటికి ప్రధాన కారకులు 48మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరగడంపై హైకోర్టు ఢిల్లీ పోలీసులను మందలించినట్టు తెలుస్తోంది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పారామిలిటరీ దళాలు, సాయుధ బలగాలతో కేంద్రం పహారా విధించింది. భద్రతను పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో అల్లర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా ఢిల్లీ అల్లర్లపై విచారణ జరిపేందుకు కేంద్రం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది.