ఏపీలో కరోనా @ 1930

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్ కేసులు 2000కి చేరువవుతున్నాయి. గత నెల రోజుల్లో తొలిసారి ఏపీలో కరోనా కేసులు అర్ధ సెంచరీకి తక్కువగా నమోదు కావడం విశేషం. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదుకావడం విశేషం. కృష్ణా జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా అత్యధిక కేసులు […]

Update: 2020-05-09 01:30 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్ కేసులు 2000కి చేరువవుతున్నాయి. గత నెల రోజుల్లో తొలిసారి ఏపీలో కరోనా కేసులు అర్ధ సెంచరీకి తక్కువగా నమోదు కావడం విశేషం. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కర్నూలు, గుంటూరు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదుకావడం విశేషం. కృష్ణా జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఈ రోజు కూడా 16 మందికి కొత్తగా కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 338కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 191 కాగా, 134 మంది డిశ్చార్జ్ కాగా, 13 మంది మృత్యువాత పడ్డారు.

చిత్తూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 22 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందితుంటే.. 74 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు జిల్లాలో 6, వైజాగ్‌లో 5, అనంతపురంలో 3, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో ఏపీలో 1930 కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. 999 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 887 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 44 మంది మృతి చెందినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

tags: corona positive, covid-19, coronavirus, health department

Tags:    

Similar News