తెలంగాణ జైళ్ల శాఖలో కరోనా కలకలం..
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర జైళ్ల శాఖలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సారి ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటేసింది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడాకారులు, పోలీసులు, వైద్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జైళ్లలో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీనిని […]
దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్ర జైళ్ల శాఖలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సారి ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటేసింది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడాకారులు, పోలీసులు, వైద్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జైళ్లలో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీనిని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం వీరంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 1811 కొత్త కేసులు నమోదయ్యాయి.