17మిలియన్ వ్యూస్‌తో.. యూట్యూబ్ కపాలం పగలకొడుతున్న బాలయ్య
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ సినిమా టీజర్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలై సెన్సేషన్ సృష్టిస్తోంది. బాలయ్య డైలాగ్‌లు, ఫైట్ సీన్లు, అఘోరాగా బాలయ్య లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ఎలాంటి ప్రమోషన్‌లు చేయకుండానే తాజాగా అఖండ టీజర్ యూట్యూబ్‌లో 17 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. బాలయ్య సినిమా కెరీర్‌లోనే అతి తక్కవ రోజుల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ ఇదేనని చెప్పవచ్చు. ‘కాలు దువ్వే నంది […]
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ సినిమా టీజర్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలై సెన్సేషన్ సృష్టిస్తోంది. బాలయ్య డైలాగ్‌లు, ఫైట్ సీన్లు, అఘోరాగా బాలయ్య లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ఎలాంటి ప్రమోషన్‌లు చేయకుండానే తాజాగా అఖండ టీజర్ యూట్యూబ్‌లో 17 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది.
బాలయ్య సినిమా కెరీర్‌లోనే అతి తక్కవ రోజుల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ ఇదేనని చెప్పవచ్చు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. తొలిసారి అఘోరా పాత్రలో బాలయ్య విభిన్నంగా కనిపించడం, బోయపాటి మార్క్ ఫైట్ సీన్స్ టీజర్‌కు ఇన్ని వ్యూస్‌ను తెచ్చిపెట్టాయి.
https://twitter.com/dwarakacreation/status/1382995397618982913
సింహా, లెజెండ్ లాగే అఖండ కూడా పవర్‌ఫుల్ టైటిల్‌లా ఉండటం, గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిండచంతో.. ఈ మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ దుమ్ముదులిపేయడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.