1600 ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదు
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో సుమారు 1600 ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించడంలేదని తేలింది. అగ్నిప్రమాదం జరిగితే ఎదుర్కోడానికి ఏర్పాటు చేయాల్సిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా లేనట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. విజయవాడలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి 10మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు చనిపోవడంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. నగరంలో నడుస్తున్న ఆసుపత్రులు నిబంధనలను పాటించడంలేదని, అగ్నిమాపక శాఖ నుంచి తగిన ఎన్ఓసీలను పొందలేదని వెల్లడైంది. నిబంధనలు పాటించని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు […]
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో సుమారు 1600 ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించడంలేదని తేలింది. అగ్నిప్రమాదం జరిగితే ఎదుర్కోడానికి ఏర్పాటు చేయాల్సిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా లేనట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. విజయవాడలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి 10మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు చనిపోవడంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. నగరంలో నడుస్తున్న ఆసుపత్రులు నిబంధనలను పాటించడంలేదని, అగ్నిమాపక శాఖ నుంచి తగిన ఎన్ఓసీలను పొందలేదని వెల్లడైంది. నిబంధనలు పాటించని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సెల్లార్లను ల్యాబ్‌లుగా, మెడికల్ దుకాణాల కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా ఆస్పత్రుల్లో అగ్రిప్రమాదం జరిగితే మరింత ఎక్కువ నష్టం వాటిల్లుతుందని గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఓ నివేదికను తయారుచేసింది. రెసిడెన్సియల్ భవనాల్లోనూ ఆస్పత్రులను నిర్వహిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. మెజారిటీ ఆస్పత్రుల్లో ఫైర్ యాక్సిడెంట్ మేనేజ్మెంట్ సిద్ధంగా లేదని తేల్చింది. దీంతో అలాంటి ఆసుపత్రులకు డీవీఎం నోటీసులు జారీచేసింది. గ్రేటర్ పరిధిలో సుమారు 1,721 ఆసుపత్రులకు హెల్త్ డిపార్ట్‌మెంట్ లైసెన్సులు జారీ చేయగా దాదాపు 1,600 ఆస్పత్రులు నిబంధనను పాటించడం లేదని గుర్తించారు.