16 ఏళ్ల బాలిక మృతి.. ఎన్నో అనుమానాలు

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఆమె గడ్డి కోయడానికి పోలంలోకి వెళ్లింది. సాయంత్రం అయినా ఆమె తిరిగి రాకపోయే సరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం గాలించగా పొలంలో పడిపోయి కనిపించింది. దగ్గరికి వెళ్లి బాలికను పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ […]

Update: 2021-03-01 01:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఆమె గడ్డి కోయడానికి పోలంలోకి వెళ్లింది. సాయంత్రం అయినా ఆమె తిరిగి రాకపోయే సరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం గాలించగా పొలంలో పడిపోయి కనిపించింది. దగ్గరికి వెళ్లి బాలికను పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అలీఘర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు బాలిక మృతికి గల కారణాలు తెలియరాలేదు.

గతంలోనూ ఇలాంటి ఘటనే..

ఫిబ్రవరి 17న ఉన్నావో జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో పశువులను మేపడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఇలాంటి పరిస్థితిలో కనిపించారు. అందులో ఇద్దరు బాలికలు మృతిచెందగా, మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ముగ్గురు బాలికలతోపాటు పశువులను మేపడానికి వచ్చిన యువకుడు వీరిలో ఓ బాలికను ప్రేమించాడు. దానికి ఆమె నిరాకరించడంతో బాలికను హతమర్చాలనుకున్నాడు. దీనిలో భాగంగా బాలికకు స్నాక్స్ తో పాటు హెర్భోసైడ్ సల్ఫ్యారిక్ మందు (విషం) కలిపిన వాటర్ ఇచ్చాడు. ఆ వాటార్ ను ఆ బాలికతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా తాగారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో బాలిక కాన్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మరవక ముందే అలీఘర్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.

Tags:    

Similar News