16 ఏళ్ల యువతి అకౌంట్లో… రూ.10 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల అమ్మాయి బ్యాంకు ఖాతాలో రూ.10 కోట్లు ఉండటాన్ని చూసి, సదరు యువతే ఆశ్చార్యానికి గురైంది. వివరాళ్లోకి వెళితే… బల్లియా జిల్లాకు చెందిన సరోజ్ అనే యువతికి, కాన్పూర్ దేహాట్ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఫోన్ చేసి, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తామని దానికోసం ఆధార్ కార్డు, ఫోటో పంపమని కోరినట్టు సరోజ్ పోలీసులకి ఫిర్యాదు […]
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల అమ్మాయి బ్యాంకు ఖాతాలో రూ.10 కోట్లు ఉండటాన్ని చూసి, సదరు యువతే ఆశ్చార్యానికి గురైంది. వివరాళ్లోకి వెళితే… బల్లియా జిల్లాకు చెందిన సరోజ్ అనే యువతికి, కాన్పూర్ దేహాట్ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఫోన్ చేసి, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తామని దానికోసం ఆధార్ కార్డు, ఫోటో పంపమని కోరినట్టు సరోజ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. అనంతరం అతను అడిగినట్టే తాను ఆధార్ వివరాలు ఇచ్చానని పేర్కొంది. జిల్లా హెడ్ క్వార్టర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్స్‌దిహ్ పట్టణంలోని అలహాబాద్ బ్యాంక్ శాఖలో తనకు 2018 నుండి ఖాతా ఉందని చెప్పింది.
ఆమె సోమవారం బ్యాంకుకు వెళ్ళినప్పుడు, ఆమె ఖాతాలో రూ 9.99 కోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని సరోజ్ చెబుతోంది. తనకు ఫోన్ చేసిన వివరాలు అడిగిన నీలేష్‌ను అడుగుదామటే, ప్రస్తుతం అతని ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోందని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని బాన్స్‌దిహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.