UGC-NET Schedule: యూజీసీ-నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు స్టార్ట్..!

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), పీహెచ్డీ(PHD) ప్రవేశాలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల(Assistant Professor) నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్(NET) నోటిఫికేషన్ గత నవంబర్ నెలలో రిలీజైన విషయం తెలిసిందే.

Update: 2024-12-20 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), పీహెచ్డీ(PHD) ప్రవేశాలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల(Assistant Professor) నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్(NET) నోటిఫికేషన్ గత నవంబర్ నెలలో రిలీజైన విషయం తెలిసిందే. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు అప్లికేషన్లను(Applications) స్వీకరించారు. ఇదిలా ఉంటే యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ(NTA) తాజాగా ప్రకటించింది. జనవరి 3 నుంచి 16 వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. సెషన్-1 పరీక్షలు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెషన్-2 పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో కండక్ట్ చేయనున్నారు. అభ్యర్థులు పరీక్షకు 8 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌ https://ugcnet.nta.ac.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించాలంటే జనరల్ కేటగిరీ వాళ్లు 40 శాతం, ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ కేటగిరీ వాళ్లు 35 శాతం మార్కులు సాధించాలి. అభ్యర్థులు  పూర్తి షెడ్యూల్ తెలుసుకోవాలనుకుంటే వెబ్‌సైట్‌ ను సందర్శించగలరు. 

Tags:    

Similar News