ఏపీలో కరోనా @ 1583

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైనప్పటికీ గత నెల 23వ తేదీ తరువాత తొలి సారి 60 కేసుల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 58 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో కర్నూలు జిల్లా కరోనా కేసులకి రాజధానిలా తయారైంది. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో 30 కరోనా పాజిటివ్ […]

Update: 2020-05-03 04:02 GMT

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైనప్పటికీ గత నెల 23వ తేదీ తరువాత తొలి సారి 60 కేసుల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 58 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో కర్నూలు జిల్లా కరోనా కేసులకి రాజధానిలా తయారైంది. పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 466కి చేరుకుంది. ఇందులో 379 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 77 మంది డిశ్చార్జ్ అయితే మరో 10 మంది మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 1 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో 319 కేసులు నమోదయ్యాయి. 115 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయితే 196 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో కూడా కరోనా కట్టడి కావడం లేదు. నిన్న 8 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరుకుంది. 212 మంది చికిత్స పొందుతుంటే, 46 మంది కోలుకున్నారు. 8 మంది మరణించారు.

అనంతపురంలో 7, చిత్తూరులో 1, నెల్లూరులో 1 కేసు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,583కి చేరుకుంది. వారిలో ఇప్పటివరకు 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. 1,062 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 6,534 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Tags: coronavirus, corona positive, covid-19, corona in ap, ap health department

Tags:    

Similar News